“అకస్మాత్తుగా ఊడిపడిన పెద్ద గుంత!” బైక్‌తో సహా లోపల పడిపోయిన యువకుడు… కొద్దిలో తప్పిన పెద్ద ప్రమాదం! సీసీటీవీలో రికార్డైన షాకింగ్ యాక్సిడెంట్ విజువల్స్!

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ పరిధిలోని కుడాసన్ ప్రాంతంలో, ప్రధాన రహదారి మధ్యలో అకస్మాత్తుగా ఒక పెద్ద గుంత (సింక్‌హోల్) ఏర్పడింది.

ఆ మార్గంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఒక యువకుడు ఊహించని విధంగా బైక్‌తో సహా నేరుగా ఆ గుంతలో పడిపోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ భయంకరమైన సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదృష్టవశాత్తూ ఆ యువకుడు హెల్మెట్ ధరించి ఉండటం, వెనుక నుంచి ఇతర వాహనాలేవీ వేగంగా రాకపోవడంతో అతడు ఎటువంటి తీవ్ర గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుపై ఇలా అకస్మాత్తుగా పెద్ద గుంత ఏర్పడటం రహదారి నిర్మాణ నాణ్యతా లోపాన్నే తెలియజేస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రహదారులపై ఉన్న గుంతల గురించి అధికారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.


Posted

in

by

Tags: