అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే ఇంట్లో.! “పెళ్లైన 10 నెలలకే ప్రాణాలు తీసుకున్న నవవధువు”. నా భర్త చాలా మంచోడు.. కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా. దొరికిన సూసైడ్ నోట్.!

రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లాలో, పెళ్లైన 10 నెలలకే ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

భరత్‌పూర్‌లోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సుకృతి యాదవ్ అనే వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుమారు 10 నెలల క్రితమే సుకృతికి, ఆమె చెల్లెలికి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులతో వివాహం జరిగింది.

కూతురు మరణవార్త విని పరుగెత్తుకు వచ్చిన సుకృతి తండ్రి రాకేష్ కుమార్, ఇది వరకట్న హత్యేనని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పెళ్లయినప్పటి నుంచి తన కూతురిని అత్త శ్యామవతి, భర్త ప్రశాంత్ యాదవ్ నిరంతరం వేధిస్తున్నారని, అదనపు కట్నంగా ‘స్కార్పియో’ కారు, నగదు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో సుకృతి రాసిన 2 పేజీల సూసైడ్ నోట్‌ను (ఆత్మహత్య లేఖను) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ లేఖలో సుకృతి.. “నేను నా భర్తతో మంచి జీవితాన్ని గడపాలని అనుకున్నాను. మా మధ్య ఎంతో ప్రేమ, స్నేహం ఉండేవి. కానీ, నా ప్రవర్తనపై ఆయనకు వచ్చిన ఒక చిన్న అనుమానం మా జీవితాన్నే నాశనం చేసింది. నా భర్తది ఎలాంటి తప్పు లేదు, పరిస్థితిని చక్కదిద్దబోయి నేనే అంతా చెడగొట్టాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను” అని భావోద్వేగంగా రాసింది.

తండ్రి ఇచ్చిన వరకట్న వేధింపుల ఫిర్యాదుకు, లేఖలో ఆమె పేర్కొన్న ‘ప్రవర్తనపై అనుమానం’ అనే కారణానికి మధ్య ఉన్న వైరుధ్యాలపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల వెలుగులో తదుపరి విచారణను వేగవంతం చేస్తామని లక్ష్మీ నగర్ పరిధిలోని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *