“అక్కా.. ఓలాను జాగ్రత్తగా చూసుకోండి.. నా దగ్గర ఈ 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి!” నెటిజన్ల మనసు కరిగించిన బాలుడి లేఖ!

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ మిడిల్ స్కూల్ విద్యార్థి, తాను ప్రాణంగా ప్రేమించే ‘ఓలా’ అనే పిల్లిని కొత్త ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లి ఒప్పుకోకపోవడంతో, గత్యంతరం లేక పక్కింటి అక్క వద్ద వదిలివెళ్లిన ఘటన నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

ఆ పిల్లిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తాను దాచుకున్న రూ.50,000 నగదుతో పాటు గుండెల్ని పిండేసేలా రాసిన ఒక లేఖను కూడా పిల్లి వద్ద ఉంచాడు.

ఆ లేఖలో బాలుడు రాస్తూ:

“అక్కా.. ఈ పిల్లి పేరు ఓలా. నేను ఇలా చేయడం తప్పని నాకు తెలుసు అక్కా, కానీ నాకు వేరే దారి లేదు. మిమ్మల్ని కాదని ఇంకెవరి వద్దా నా పిల్లిని వదిలిపెట్టలేను. నేను, మా కుటుంబం ఇల్లు మారుతున్నాం అక్కా.. మా అమ్మ ఈ పిల్లిని నాతో పాటు రానివ్వడం లేదు. దయచేసి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అక్కా. నా దగ్గర ప్రస్తుతం ఈ 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అక్కా..”

తన పెంపుడు పిల్లిని విడిచి ఉండలేక, అది క్షేమంగా ఉండాలనే తాపత్రయంతో ఆ చిన్నారి రాసిన ఈ భావోద్వేగ లేఖ, దాచుకున్న డబ్బంతా ఇచ్చేసిన వైనం సోషల్ మీడియాలో అందరి హృదయాలను కదిలిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *