“అతనితో చాటింగ్ చేస్తూ దొరికిపోయింది.. అందుకే చంపేశా!”.. లివ్-ఇన్ పార్ట్‌నర్‌ను ముక్కలు ముక్కలుగా నరికిన కిరాతకుడు.. డిజిటల్ ఆధారాలతో దొరికిపోయిన వైనం..!!

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో లివ్-ఇన్ పార్ట్‌నర్‌ను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన దారుణ ఘటన కలకలం రేపింది.

హేమల్ కగారియా అనే వ్యక్తి, ముగ్గురు పిల్లల తల్లి అయిన రేష్మా ఖాన్ (సనా) అనే వివాహితతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో, రేష్మా వేరే వ్యక్తులతో ఫోన్‌లో చాటింగ్ చేస్తోందని హేమల్ అనుమానించాడు. దీనిపై జూలై 4న వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఆ తర్వాత సర్దుకుపోయారు.

అయితే, రేష్మా గాఢ నిద్రలో ఉన్న సమయంలో హేమల్ ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, శవం గుర్తుపట్టలేనంతగా ముక్కలు చేసి, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. లభించిన శరీర భాగాలపై డిజిటల్ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేయగా, అది రేష్మాదేనని తేలింది. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత హేమల్‌ను అరెస్టు చేశారు. విచారణలో, గుజరాత్‌లో జరిగిన ఒక జంట హత్య కేసులో కూడా ఇతడు నిందితుడని వెల్లడైంది.


Posted

in

by

Tags: