న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్, భారత జట్టుకు చెందిన యువ, ప్రతిభావంతుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు.
ఐపీఎల్ టోర్నమెంట్లో తాను అతనికి వ్యతిరేకంగా ఆడానని పేర్కొన్న ఆయన, వైభవ్ సూర్యవంశీ ఎప్పుడూ నమ్మశక్యం కాని ప్రతిభ గల ఒక విధ్వంసకర ఆటగాడని కొనియాడారు.
ఐపీఎల్ టోర్నీలలో నిలకడగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అతను, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకోవడంషో ఎటువంటి ఆశ్చర్యం లేదని ఫెర్గూసన్ తెలిపాడు.
ముఖ్యంగా, న్యూజిలాండ్ గడ్డపై అతన్ని ఎదుర్కొనే సవాల్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఇది అతనికి న్యూజిలాండ్‌లో మొదటి పర్యటన కావచ్చని పేర్కొన్నాడు.
ఈ పర్యటన ఇరు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా మరియు ఆసక్తికరంగా సాగుతుందని లాకీ ఫెర్గూసన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
యువ ఆటగాడి రాక మరియు న్యూజిలాండ్ జట్టు పేస్ బౌలర్ల సవాల్ ఈ సిరీస్‌పై క్రికెట్ ప్రపంచంలో భారీ అంచనాలను పెంచాయి.

Leave a Reply