మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో, ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
యవత్మాల్లోని పింపల్గావ్ బైపాస్ రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. ఎదురుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు, ఊహించని రీతిలో ఉపాధ్యాయురాలు వెళ్తున్న టూవీలర్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రత ఎంత భయానకంగా ఉందంటే.. ఆ కారు ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సదరు ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ఆ భయానక దృశ్యాలు చూసిన వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
తీవ్ర గాయాలపాలైన ఉపాధ్యాయురాలిని స్థానికులు వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply