“అత్యాచారం జరగలేదు, కానీ..” బస్తా మూటల హత్య కేసులో అనూహ్య మలుపు.. వెలుగులోకి వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక!

చెన్నైలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన దంపతులను, వారి 2 ఏళ్ల చిన్నారిని అదే రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. తొలుత, నిందితులు ఆ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినప్పుడు ఈ హత్యలు జరిగాయని భావించారు.

అయితే, తాజాగా వచ్చిన వైద్య పరీక్షల నివేదిక (Post-mortem report) ప్రకారం.. ఆ మహిళపై లైంగిక దాడి జరగలేదని తేలింది. నిందితులు ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

అసలేం జరిగింది? హత్యల అనంతరం, నిందితులు ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను వేర్వేరు బస్తా మూటల్లో కట్టి అడయార్, బకింగ్‌హామ్ కాలువ మరియు పెరుంగుడి చెత్త యార్డ్ వంటి వేర్వేరు ప్రాంతాలలో పడేశారు. పోలీసులు తీవ్రంగా గాలించి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒక నిండు కుటుంబాన్ని ఇలా బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.


Posted

in

by

Tags: