“అద్భుతమైన అవకాశం! కేవలం ₹7,500 ఉంటే చాలు జర్మనీ వెళ్లవచ్చు.. కుటుంబంతో సహా స్థిరపడటానికి అరుదైన అవకాశం.. జర్మనీ ప్రభుత్వ సంచలన ప్రకటన..!!”

జర్మనీలో నివసిస్తూ ఉద్యోగం చేయాలనుకునే వ్యక్తులకు ఆ దేశ ప్రభుత్వం ఒక ఉత్తమమైన అవకాశాన్ని అందించింది.

నివాస చట్టం నిబంధన 21(5) కింద మంజూరు చేయబడుతున్న ‘జర్మనీ ఫ్రీలాన్స్ వీసా’ ద్వారా కేవలం 7,500 రూపాయల రుసుముతో ఒక సంవత్సరం వరకు అక్కడ నివసిస్తూ పనిచేయవచ్చు. అంతేకాకుండా ఈ వీసా కలిగిన వారు తమ భార్య మరియు 21 సంవత్సరాల లోపు పిల్లలను కూడా తమతో పాటు తీసుకెళ్లవచ్చు.

ఈ వీసా పథకం ప్రధానంగా పత్రకారులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, ఇంజనీర్లు, లాయర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు మరియు అనువాదకులు వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణుల కోసం తీసుకురాబడింది. ఈ వీసా పొందడానికి దరఖాస్తుదారులు తమ రంగానికి సంబంధించిన విద్యా ధృవీకరణ పత్రాలు, వృత్తిపరమైన అనుభవం, చెల్లుబాటు అయ్యే ఆరోగ్య భీమా మరియు తగిన ఆర్థిక వనరులను సమర్పించాల్సి ఉంటుంది.

ఆర్థిక వనరుగా తమ ఖాతాలో కనీసం నెలకు సుమారు 1,280 యూరోల (దాదాపు రూ. 1.27 లక్షలు) సదుపాయం ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. అలాగే 10 సంవత్సరాల లోపు పొందిన పాస్‌పోర్ట్, వ్యాపార సంబంధాల ఆధారాలు మరియు 45 సంవత్సరాలు పైబడిన వారైతే పింఛనుకు సంబంధించిన పత్రాలు ఈ దరఖాస్తుకు అవసరమైన ముఖ్యమైన పత్రాలు.

భారతీయులు ఈ వీసాకు దరఖాస్తు చేయడానికి ముందుగా భారతదేశంలోని జర్మన్ రాయబార కార్యాలయం లేదా డిప్యూటీ రాయబార కార్యాలయంలో నేరుగా వెళ్లడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తగిన పత్రాలు మరియు బయోమెట్రిక్ వివరాలను సమర్పించి ‘నేషనల్ D వీసా’ పొందాలి. ఈ వీసా మంజూరైన తర్వాత 3 నుండి 6 నెలల లోపు జర్మనీకి వెళ్లి తమ పనిని ప్రారంభించవచ్చు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *