‘అధ్యక్షుడు మదురో మరియు ఆయన భార్య అమెరికా అదుపులో ఉన్నారు’, వెనిజులాపై వైమానిక దాడుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

అమెరికాతో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య, వెనిజులా రాజధాని కరాకస్ శనివారం (జనవరి 3, 2026) ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. తమ పౌర మరియు సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిందని వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ఇప్పుడు అమెరికా అదుపులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన:

“వెనిజులా మరియు ఆ దేశ నేత నికోలస్ మదురోపై అమెరికా చేపట్టిన భారీ స్థాయి దాడి విజయవంతమైంది. నికోలస్ మదురో మరియు ఆయన భార్యను బంధించి దేశం వెలుపలికి తరలించాము. ఈ ఆపరేషన్ యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి నిర్వహించబడింది. త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడిస్తాము.”

నేపథ్యం:
  • నికోలస్ మదురోను అధికారంలో నుంచి తొలగించే వ్యూహంలో భాగంగా వెనిజులాలో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు.
  • ఆ హెచ్చరికల తర్వాతే వెనిజులాలో వరుస పేలుళ్లు సంభవించాయి.
  • వెనిజులాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా ఇప్పటికే ఆ దేశంపై ఆంక్షలను పొడిగించింది, కెరీబియన్ మరియు పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా సైనిక ఉనికిని పెంచింది.
నికోలస్ మదురో గతవ్యాఖ్యలు:

గురువారం (డిసెంబర్ 1, 2025) రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రభుత్వం మార్చడానికి మరియు అక్కడి అపారమైన చమురు నిల్వలపై పట్టు సాధించడానికి అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఆగస్టు నెలలో కెరీబియన్ సముద్రంలో అమెరికా సైనిక మోహరింపుతోనే ఈ కుట్ర ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.


Posted

in

by

Tags: