అనేక అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన రష్యా నగరం; దశాబ్దాల తర్వాత వచ్చిన అతిపెద్ద విపత్తు.. భయంకరమైన వీడియో వైరల్!

రష్యాలోని కమ్‌చట్కాలో కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. రాజధాని పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్‌చట్స్కీలోని రహదారులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. గత వారం రోజులుగా కురుస్తున్న మంచు, వడగళ్ల వాన మరియు భీకర గాలుల కారణంగా ఈ ప్రాంతం చిన్నాభిన్నమైంది.

పరిస్థితి తీవ్రత: కమ్‌చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ.. నగరంలో పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రధాన రహదారులను శుభ్రం చేసి, సాధారణ రవాణాను పునరుద్ధరించడానికి ఆయన జనవరి 21 వరకు గడువు విధించారు.

మంచు కారణంగా మరణాలు: గురువారం నాడు భారీగా పేరుకుపోయిన మంచు మీద పడటంతో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగర అధికారులు అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. మంచును సకాలంలో తొలగించడంలో విఫలమైన ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కంపెనీలదే ఈ మరణాలకు బాధ్యత అని మేయర్ ఆరోపించారు.

చరిత్రలో మొదటిసారి: వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. జనవరి ప్రారంభం నుండి కమ్‌చట్కాలో కురుస్తున్న మంచు స్థాయి గత 50 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు.

  • డిసెంబర్ నెలలో సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ హిమపాతం నమోదైంది.
  • జనవరి 1 నుండి 16 మధ్య సగటు కంటే 150 శాతం ఎక్కువ మంచు కురిసింది.
  • నగరంలో మంచు సగటున 5.5 అడుగుల ఎత్తున పేరుకుపోగా, కొన్ని చోట్ల ఇది 8 అడుగులకు పైగా ఉంది.

ప్రభుత్వ చర్యలు: స్కూళ్లను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని గవర్నర్ ఆదేశించారు. ఆహారం మరియు ఇంధన సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. భవనాల పైకప్పుల నుండి వేలాడుతున్న మంచు గడ్డల (Ice cliffs) వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలు భవనాల సమీపంలో నడవవద్దని గవర్నర్ హెచ్చరించారు.


Posted

in

by

Tags: