“అన్న చేసిన ఘాతుకం.. పట్టించుకోని తల్లి..!” ఇద్దరు బాలికలకు జరిగిన దారుణం.. సొంత కొడుకుకే వత్తాసు పలికిన కన్నతల్లి.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం…!!

చెన్నై అంబత్తూరు ప్రాంతంలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తల్లి, ఆమె కుమారుడిని పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టు చేశారు.

బాధిత బాలికలిద్దరూ తిరువళ్లూరులోని ఓ వసతి గృహంలో (హాస్టల్) ఉంటూ వరుసగా 11, 9వ తరగతులు చదువుతున్నారు.

సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు, తమకు వరుసకు అన్నయ్య అయ్యే 24 ఏళ్ల యువకుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ బాలికలు హాస్టల్‌లోని తోటి విద్యార్థినులకు తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న అంబత్తూరు మహిళా పోలీసులు (All Women Police) జరిపిన విచారణలో, కొడుకు చేస్తున్న దారుణాన్ని తల్లి చూసీచూడనట్లు వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది.

దీంతో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని, అందుకు సహకరించి వత్తాసు పలికిన తల్లిని.. ఇద్దరినీ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *