సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు త్రిప్తి భట్. ఆమె 9వ తరగతిలో ఉన్నప్పుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు కలాం ఆమెకు స్వహస్తంతో రాసి ఇచ్చిన ఒక ప్రేరణాత్మక లేఖ త్రిప్తి జీవితాన్నే మలుపు తిప్పింది.
16 ఉద్యోగాలను వదులుకుని.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆమెకు ఎన్టీపీసీ (NTPC)లో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె లక్ష్యం మాత్రం యూపీఎస్‌సీ (UPSC) సాధించడమే. తన కలను నిజం చేసుకోవడం కోసం ఆమె ఇస్రో (ISRO) వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో సహా మొత్తం 16 ప్రభుత్వ ఉద్యోగాలను ధైర్యంగా వదులుకున్నారు. “ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గగనమైన ఈ రోజుల్లో, చేతికి వచ్చిన 16 అవకాశాలను వదులుకోవడమా?” అంటూ ఎదురైన విమర్శలను ఆమె పట్టించుకోలేదు.
మొదటి ప్రయత్నంలోనే విజయం: తన అంకితభావం వృథా పోలేదు. త్రిప్తి భట్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీ పరీక్షలో విజయం సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. “గొప్ప కలలు కనండి, మిమ్మల్ని మీరు నమ్మండి” అనే సూత్రాన్ని పాటిస్తూ ఆమె సాధించిన ఈ విజయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది యువతకు ఆమె ఒక రియల్ రోల్ మోడల్‌గా నిలిచారు.
