“అబ్బో ఎంత ధైర్యం! నా కుక్కనే పట్టుకుని కొడతావా?!” చిరుతనే నేరుగా నిలదీసిన రైతు… తప్పు చేసిన పిల్లాడిలా బిక్కమొహం వేసిన చిరుతపులి!

మధ్యప్రదేశ్‌లో తన పెంపుడు కుక్కపై దాడి చేసిన చిరుతపులిని ఒక రైతు నేరుగా నిలదీయగా.. ఆ చిరుత తప్పు చేసిన చిన్నపిల్లాడిలా అమాయకంగా చూస్తూ విన్న ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మాధవ్ నేషనల్ పార్క్ సమీపంలోని హదోద్ గ్రామానికి చెందిన రైతు మనీష్ మల్హోత్రా కారులో వెళ్తుండగా, రోడ్డు పక్కనే ఒక చిరుతపులి కూర్చుని ఉండటం గమనించాడు. వెంటనే కారు ఆపి, అద్దం దించి ఆ చిరుతతో మాట్లాడటం ప్రారంభించాడు.

తాను ప్రాణంగా చూసుకునే ‘టప్పు’ అనే కుక్కపై నిన్న దాడి చేయడం న్యాయమేనా అంటూ ప్రశ్నించిన రైతు.. గ్రామస్తులకు ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా అడవిలోనే ఉండాలని చిరుతకు క్లాస్ పీకాడు. రైతు మందలిస్తుంటే ఆ చిరుతపులి ఏమాత్రం దాడి చేయకుండా.. తప్పు చేసిన స్కూల్ పిల్లాడిలా గుడ్లప్పగించి చూస్తూ నిలబడిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. మనిషికి, క్రూర మృగానికి మధ్య జరిగిన ఈ అరుదైన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Posted

in

by

Tags: