అబ్బో.. ఒక డేటింగ్‌కి ఇన్ని వేలా?. ప్రపంచంలోనే అత్యంత కాస్లీ నగరం ఏదో తెలుసా?.. షాకైన ప్రేమ జంటలు.. నెటిజన్లను ఆశ్చర్యపరిచిన రిపోర్ట్..!!!

డేటింగ్‌కి వెళ్లడమంటేనే జేబు ఖాళీ అయిపోతుందని ఆందోళన చెందే ప్రేమికులకు ఒక ఆసక్తికరమైన మరియు సంతోషకరమైన వార్త వెలువడింది.

ప్రముఖ జర్మన్ బ్యాంక్ ‘డ్యుయిష్ బ్యాంక్’ (Deutsche Bank) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే ప్రేమ జంటలు అత్యంత తక్కువ ఖర్చుతో డేటింగ్‌కు వెళ్లి రాగల నగరాల జాబితాలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ఆశ్చర్యపరిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఒక ప్రేమ జంట తమ వారాంతాలను (వీకెండ్స్) సెలబ్రేట్ చేసుకోవడానికి డేటింగ్‌ వెళ్తే ఎంత ఖర్చవుతుందనే దాని ఆధారంగా ఈ అధ్యయనం లెక్కగట్టింది.

ఈ నివేదిక ప్రకారం, ఢిల్లీలో ఒక ప్రేమ జంట డేటింగ్‌కు వెళ్లడానికి సగటున కేవలం 9,920 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో ఇద్దరి సినిమా టిక్కెట్లు, ఒక మంచి రెస్టారెంట్‌లో మధ్యాహ్న లేదా రాత్రి భోజనం, కొన్ని కూల్ డ్రింక్స్ మరియు రవాణా ఖర్చులు ఇలా అన్నీ కలిసి ఉన్నాయి.

భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో మరియు ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు.. ఢిల్లీలో వినోద సాధనాలు, రెస్టారెంట్లు మరియు ప్రజా రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉండటం, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

దీనికి పూర్తి భిన్నంగా, ప్రపంచంలోనే డేటింగ్ చేయడానికి అత్యంత ఎక్కువ ఖర్చయ్యే నగరంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం ఎంపికైంది. జెనీవాలో ఒక ప్రేమ జంట ఒకే ఒక్కసారి డేటింగ్‌కు వెళ్లి రావడానికి సగటున 45,750 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ఢిల్లీలో అయ్యే ఖర్చు కంటే ఇది దాదాపు 4 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

విలాసవంతమైన జీవనశైలి, అధిక ద్రవ్యోల్బణం ఉన్న పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, భారతదేశంలో బడ్జెట్ పరిధిలోనే తమ ప్రేమ క్షణాలను ఆనందంగా జరుపుకోవడానికి ఢిల్లీ ఒక ఉత్తమమైన ప్రదేశంగా నిలిచిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.


Posted

in

by

Tags: