అమెరికా గుండెపై కొట్టిన ఇరాన్.. చైనా కరెన్సీలో వ్యాపారం చేసే నౌకలకే హార్ముజ్ జలసంధి గుండా అనుమతి.. ఇరాన్ ప్రకటనతో వణికిపోతున్న అమెరికా.. చైనా కరెన్సీకి మొగ్గు చూపుతున్న దేశాలు.. డాలర్ స్థానాన్ని యువాన్ భర్తీ చేయనుందా? ఇందులో భారత్ పరిస్థితి ఏంటి? ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ..

అమెరికా ప్రపంచ శక్తిగా వెలుగొందడానికి కారణం కేవలం దాని సైనిక బలం లేదా క్షిపణులు మాత్రమే కాదు; దాని అసలు బలం ‘డాలర్’ అనే కరెన్సీలో ఉంది. ప్రపంచ దేశాలు చమురు లేదా ఇతర వస్తువుల వ్యాపారం చేసేటప్పుడు అమెరికా డాలర్‌ను ఉపయోగించాలనే ఒక పటిష్టమైన వ్యవస్థను (పెట్రో-డాలర్) అమెరికా నిర్మించింది. కానీ ఇప్పుడు ఇరాన్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచే ఆయుధంగా మారింది.

ఇరాన్ సంచలన ప్రకటన: హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు మరియు గ్యాస్ నౌకలు డాలర్‌కు బదులుగా చైనా కరెన్సీ ‘యువాన్’ ద్వారా వ్యాపారం చేస్తే, వాటికి ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అంటే డాలర్‌లో వ్యాపారం చేసే నౌకలపై దాడులు జరిగే అవకాశం ఉందనే పరోక్ష హెచ్చరిక ఇందులో ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం వాటా ఉన్న ఈ ప్రాంతంలో ఇరాన్ ఎత్తుగడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద తలనెొప్పిగా మారింది.

ఆర్థిక యుద్ధం: ఇరాన్ మీద కొన్ని క్షిపణులు వేస్తే అక్కడ ప్రజా తిరుగుబాటు వచ్చి ప్రభుత్వం మారుతుందని అమెరికా అంచనా వేసింది. కానీ ఇరాన్ ఇప్పుడు ‘ఆర్థిక యుద్ధాన్ని’ ఎంచుకుంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ, చమురు ధరను బ్యారెల్‌కు 200 డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చమురు ధర 100 డాలర్లు దాటి వేగంగా పెరుగుతోంది.

చైనా వ్యూహం: ఈ విషయంలో చైనా చాలా నిశితంగా వ్యవహరిస్తోంది. పైకి ఇరాన్ నిర్ణయాన్ని నేరుగా సమర్థించకపోయినా, తెర వెనుక ఇరాన్‌కు చైనా పూర్తి మద్దతు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి యువాన్‌ను ప్రపంచ కరెన్సీగా మార్చాలనే చైనా చిరకాల స్వప్నానికి ఇరాన్ ఇప్పుడు మార్గం సుగమం చేస్తోంది.

ప్రపంచ దేశాల డైలమా: హార్ముజ్ జలసంధిలో తమ నౌకలు సురక్షితంగా వెళ్లాలంటే చాలా దేశాలు ఇప్పుడు చైనాను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. యుద్ధం మొదలై 15 రోజులు కావస్తున్నా, సైనిక నష్టం కంటే డాలర్ విలువ పడిపోవడం అమెరికాను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇరాన్ అనేది వెనిజులా లేదా క్యూబా వంటి చిన్న దేశం కాదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగే పోరాటమని అమెరికా ఆలస్యంగా గుర్తిస్తోంది.


Posted

in

by

Tags: