వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం ద్వారా అమెరికా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యంత రహస్య మిషన్ వెనుక ఉన్న వ్యూహాన్ని అమెరికా సైనిక ఉన్నతాధికారి జనరల్ డాన్ కేన్ వెల్లడించారు. మదురో మరియు అతని భార్యను అదుపులోకి తీసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.
సన్నిహితుడిగా మారిన సీక్రెట్ ఏజెంట్
ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలకమైన అంశం ఒక సీక్రెట్ ఏజెంట్. అమెరికాకు చెందిన ఒక ఏజెంట్ అత్యంత చాకచక్యంగా మదురో అంతర్గత వర్గంలోకి (Inner Circle) చొరబడ్డాడు. మదురోకు అత్యంత సన్నిహితుడిగా మారి, అక్కడి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు అమెరికాకు చేరవేసేవాడు. ఈ ఏజెంట్ ఇచ్చిన సమాచారమే ఆపరేషన్ విజయవంతం కావడానికి ప్రధాన కారణమైంది.
నెలల తరబడి నిఘా
అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కి చెందిన ఒక బృందం తమ గుర్తింపును మార్చుకుని వెనిజులా రాజధాని కారకాస్‌లోకి ప్రవేశించింది.
- వీరు నెలల తరబడి కారకాస్ వీధుల్లో సామాన్యుల్లా తిరుగుతూ మదురోపై నిఘా పెట్టారు.
- మదురో ఎప్పుడు నిద్రలేస్తారు, ఏం తింటారు, ఎవరిని కలుస్తారు, చివరికి ఆయన పెంపుడు జంతువుల అలవాట్లు ఏమిటి అనేంత వరకు ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకున్నారు.
6 నుండి 8 రహస్య స్థావరాలు
మదురో ప్రాణభయంతో ఒకే చోట ఉండకుండా, దాదాపు 6 నుండి 8 రహస్య ప్రాంతాల్లో మారుతూ ఉండేవారు. అయితే డెల్టా ఫోర్స్‌కు మదురో ఎక్కడ ఉన్నారనే సమాచారం ముందుగానే ఉండేది. దాడులు చేసే సమయానికి ఆయన ఖచ్చితంగా ఆ భవనంలోనే ఉన్నారని నిర్ధారించుకున్నాకే ఆపరేషన్ మొదలుపెట్టారు.
రాష్ట్రపతి భవనం నమూనాతో రిహార్సల్స్
ఈ ఆపరేషన్‌ను అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన ప్రత్యేక విభాగం ‘డెల్టా ఫోర్స్’ (Delta Force) నిర్వహించింది.
- అమెరికాలోని కెంటకీ నగరంలో మదురో నివసించే అధ్యక్ష భవనం వంటి నమూనాను (Full-scale model) నిర్మించారు.
- కమెండోలు రాత్రింబవళ్లు ఆ నమూనా భవనంపై దాడులు చేస్తూ రిహార్సల్స్ నిర్వహించారు.
- ఈ మిషన్ కోసం దాదాపు 150 యుద్ధ విమానాలు, అన్ని సైనిక విభాగాల సమన్వయంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాడికి దిగారు.
చివరికి పక్కా ప్లానింగ్ మరియు మెరుపు దాడితో మదురోను అమెరికా దళాలు బంధించగలిగాయి.
