ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ ప్రాంతంలో జరిగిన ఓ అమానుష ఘటన, కుటుంబ బంధాల విలువలపైనే తీవ్ర అనుమానాలు కలిగించేలా చేసింది.
కన్నతల్లిని కోల్పోయిన 16 ఏళ్ల మైనర్ బాలికపై సొంత తాతే గత మూడు నెలలుగా వరుసగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
హత్రాస్ జిల్లా సికందరారావు ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలైన బాలిక తల్లి గతంలోనే మరణించడంతో, ఆమె తన తండ్రి, తాతతో కలిసి నివసిస్తోంది. సుమారు నాలుగైదు నెలల క్రితం బంధువుల ఇంటి నుంచి వచ్చిన ఆ బాలికపై, జూన్ 20న 70 ఏళ్ల వృద్ధుడైన తాత బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, బాలిక తండ్రి పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడల్లా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై నిరంతరం అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఇటీవల సదరు బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా విస్తుపోయే దారుణ నిజం వెలుగుచూసింది. వైద్య పరీక్షల్లో ఆ బాలిక రెండున్నర నెలల గర్భవతి అని తేలింది. ఈ వార్త విని షాక్కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Leave a Reply