“అయ్యయ్యో. మనిషి రైలు కిందకి వెళ్లిపోయాడే!” కదులుతున్న రైలు ఎక్కిన ప్రయాణికుడు. అకస్మాత్తుగా జరిగిన విపరీతం! కనురెప్ప పాటులో చేయూతనందించిన ఆర్పీఎఫ్ (RPF) జవాను. తర్వాతి కొన్ని సెకన్లలో జరిగిన నమ్మలేని ట్విస్ట్.!!!

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడి కాలు అకస్మాత్తుగా జారింది. మరుసటి క్షణమే అతను రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఖాళీలోకి పడిపోయే స్థితికి చేరుకున్నాడు.

చుట్టుపక్కల ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే, అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ (RPF) జవాను రాకేష్ పాల్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ప్రయాణికుడు కింద పడిపోకుండా అతని చేతిని పట్టుకున్న రాకేష్ పాల్, తన పూర్తి శక్తితో అతన్ని తిరిగి ప్లాట్‌ఫామ్ మీదికి లాగాడు. అంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. కాస్త ఆలస్యమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, జవాను చురుకైన చర్య వల్ల ప్రయాణికుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలో ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించడం, అకస్మాత్తుగా అదుపుతప్పి కింద పడిపోవడం, వెంటనే ఆర్పీఎఫ్ జవాను అతన్ని పట్టుకుని పైకి లాగడం నమోదైంది. ఆ కొన్ని సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, జవాను సమయస్ఫూర్తికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. రైలు మళ్లీ బయలుదేరగానే అతడు అదే రైలులో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఒక్క క్షణం అజాగ్రత్త ప్రాణాలనే బలితీసుకునే పరిస్థితిలో, చివరి క్షణంలో చేయూతనందించిన ఆ జవాను చర్య ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *