రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాలో నడుస్తున్న ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో విద్యార్థులు ఎప్పటిలాగే స్కూల్‌కి వెళ్తున్నారు.
ఆ బస్సు వెళ్తున్న సమయంలో, హఠాత్తుగా వాహనం లోపల దాదాపు 5 అడుగుల పొడవున్న తెల్ల నాగుపాము ప్రాకుతూ వెళ్లడం చూసి బస్సు డ్రైవర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే ఏమాత్రం కంగారు పడకుండా తక్షణ సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆయన, బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తపించింది.
బస్సులో విషసర్పం ఉందని తెలుసుకున్న విద్యార్థులందరూ భయంతో కేకలు వేశారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చిన డ్రైవర్, స్థానిక పాములు పట్టే నిపుణుడికి సమాచారం అందించాడు. దాంతో అక్కడికి వేగంగా చేరుకున్న స్నేక్ రెస్క్యూయర్ ‘హనే సింగ్’, తీవ్రంగా శ్రమించి అత్యంత చాకచక్యంగా ఆ భయంకరమైన తెల్ల నాగుపామును సురక్షితంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నాడు.
అనంతరం, పట్టుబడిన ఆ పామును సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. విద్యార్థులతో నిండివున్న స్కూల్ బస్సులోకి పాము ప్రవేశించిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపడమే కాకుండా, పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యంలో తీవ్ర ఆందోళనను నింపింది.

Leave a Reply