న్యూయార్క్‌లోని ఒక దుకాణంలో హిందీ మాట్లాడే ఓ మహిళ కూల్‌డ్రింక్ క్యాన్‌ను దొంగిలిస్తూ షాపు యజమానికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన మొత్తాన్ని సదరు దుకాణ యజమాని తన కెమెరాలో రికార్డ్ చేశారు.
దాహం వేయడం వల్లే తాను కూల్‌డ్రింక్ తీసుకున్నానని, తన వద్ద ఎలాంటి డబ్బులు లేవని, గత 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఆ మహిళ దుకాణదారుడికి వివరించారు.
ఆ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట విడుదలైన కొద్దిసేపట్లోనే 30 లక్షలకు పైగా వీక్షణలు (వ్యూస్) సాధించి విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అమెరికాలో కూడా ఇంతటి పేదరికంలో ప్రజలు జీవిస్తున్నారా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న దుకాణ యజమాని, ఆమె వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోకుండా జాలితో అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతించారు. షాపు యజమాని చూపిన ఈ ఔదార్యాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆ మహిళ పాకిస్తాన్‌కు చెందినది అయి ఉండవచ్చని అభిప్రాయపడుతుండగా, ఈ సంఘటన అమెరికా జీవన విధానం వెనుక ఉన్న మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.

Leave a Reply