అయ్యో ఘోరం.. మిగిలిన రూ.15 చిల్లర అడిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. చెవిలో కత్తితో పొడిచిన దుకాణదారుడు.. బీహార్‌లో షాకింగ్ ఘటన.!

బీహార్‌లోని చాప్రా పట్టణానికి చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, దుకాణదారుడి వద్ద తనకు రావాల్సిన మిగిలిన రూ.15 చిల్లర అడిగినందుకు.. ఆయన చెవిలో కత్తితో పొడిచిన భయానక ఘటన వెలుగుచూసింది.

పాలు కొనుగోలు చేసిన దుకాణంలో మిగిలిన చిల్లర అడగడమే ఈ దాడికి కారణమైంది.

దాడికి గురైన ప్రొఫెసర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. స్వల్ప మొత్తం కోసం జరిగిన ఈ కిరాతక దాడిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags: