అయ్యో దేవుడా.. అందరినీ ముగించేసి నేనూ పోతున్నా..! భార్యను, చెల్లెలిని కాల్చి చంపిన కిరాతక భర్త.. తానూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య.. లక్నోలో తీవ్ర కలకలం.!

లక్నోలో గురువారం నాడు మనోజ్ బాజ్‌పాయ్ అనే వ్యక్తి తన భార్యను, సొంత చెల్లెలిని తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.

ఆయన తన భార్య దివ్య మిశ్రాను.. ఆమె రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ బ్రాంచ్ బయటే రెండు రౌండ్లు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు.

కాల్పులు జరిపిన వెంటనే భర్త అక్కడి నుంచి పరారవ్వగా, తీవ్ర రక్తస్రావంతో పడివున్న దివ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, అక్కడి నుంచి పరారైన మనోజ్ బాజ్‌పాయ్.. ఆ తర్వాత తన సొంత చెల్లెలిని కూడా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఘటనా స్థలంలోనే ప్రాణాలు తీసుకున్నాడు.


Posted

in

by

Tags: