అయ్యో దేవుడా. ఒక గంటలో చంపేస్తాను?. బెదిరించి వెళ్లిన పొరుగువారి దారుణం. వాకిట్లో నిలబడటాన్ని నిలదీసిన మహిళ కాల్చివేత. భయాందోళన కలిగించే సంఘటన.!

రాజస్థాన్ రాష్ట్రం డీగ్ జిల్లాలోని మావాయ్ గ్రామానికి చెందిన గీతా దేవి అనే మహిళ, ఆదివారం ఉదయం తన పొరుగువారి చేతిలో తుపాకీతో కాల్చి చంపబడింది.

నిందితుడు రోజూ ఆ మహిళ ఇంటి వాకిట్లోకి వచ్చి నిలబడటం అలవాటుగా చేసుకోవడంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ సమయంలో గీతా దేవి అతడిపై దాడి చేయడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి, ఆమెను కాల్చి చంపాడు.

బాధితురాలు గీతా దేవి కుమార్తె గూడియా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వాకిట్లో నిలబడి ఉన్న ఆ వ్యక్తిని నిలదీయడంతో గొడవ ముదిరింది. ఆ సమయంలో గీతా దేవి అతడిని కొట్టడంతో, “ఒక గంటలో మిమ్మల్ని చంపేస్తాను” అని బెదిరించి వెళ్లిపోయాడు. చెప్పినట్లే గంట తర్వాత తిరిగి వచ్చిన ఆ వ్యక్తి, పొలం నుండి గడ్డి మోసుకొచ్చిన గీతా దేవి తనపై కర్రతో దాడి చేయడంతో, తన వద్ద ఉన్న నాటు తుపాకీని తీసి ఒకే ఒక్కసారి కాల్చాడు.

గాయపడిన గీతా దేవిని భరత్‌పూర్‌లోని ఆర్‌.బి.ఎమ్ ఆసుపత్రికి తరలించారు, అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించగా స్థానిక గ్రామస్తులు వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను డీగ్ ఎస్పీ కాంబ్లే శరణ్ గోపీనాథ్ సేకరించి, విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *