“అయ్యో దేవుడా.. చేతిలో మందు కొనుగోలు చేయడానికి కూడా దారిలేదా స్వామి”.. కళ్లముందే ఫిట్స్‌తో నొప్పులు పడుతున్న 5 ఏళ్ల బాలుడు.. గుండెలు బాదుకుని రోధిస్తున్న తల్లి..!!

ఒక తల్లికి తన బిడ్డ వేదన కంటే పెద్ద విషాదం ఏముంటుంది? ఆడుకునే వయస్సులో చేతిలో బొమ్మలు పట్టుకుని ఆనందించాల్సిన 5 ఏళ్ల బాలుడు, నిరంతర ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) తో కొట్టుమిట్టాడుతున్నాడు.

తన కళ్ల ముందే బిడ్డ నొప్పితో విలవిల్లాడడాన్ని చూసి, ఏమీ చేయలేక ఏడ్చి పరితపించే ఆ తల్లి పరిస్థితి గుండెల్ని పిండేసేలా ఉంది.

వైద్యులు అవసరమైన మందులను సూచించినప్పటికీ, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం పక్కనే ఉన్న మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తెచ్చుకునే అవకాశం లేని దుస్థితి నెలకొంది. మెడికల్ షాప్ దగ్గర్లోనే ఉన్నప్పటికీ, సరైన అనుమతి లేని ఒకే ఒక్క కారణంతో ఆ ముఖ్యమైన మందు ఆ పసికందుకు అందకపోవడం అంతకంటే పెద్ద దారుణం.

కళ్ల ముందే తనకు పుట్టిన బిడ్డ తల్లడిల్లిపోతుంటే, అతనికి సహాయం చేయలేక చేతకాని స్థితిలో నిలబడిన ఆ తల్లి వేదన మాటల్లో వర్ణించలేనిది. ఏ తల్లికైనా దీనికంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు.


Posted

in

by

Tags: