ప్రతాప్‌గఢ్ సమీపంలోని లక్నో-వారణాసి రైల్వే మార్గంలో ఉన్న గిదిర్పూర్ ప్రాంతంలో, ఒక కుటుంబానికి చెందిన మహిళలు తమ మేకలను రైలు పట్టాల సమీపంలో మేపుతున్నారు.
ఆ సమయంలో, ఆ మార్గంలో వేగంగా వస్తున్న రైలు హారన్ మోగిస్తూ రైలు పట్టాల వైపు సమీపించసాగింది.
రైలు రావడం చూసిన వెంటనే, అక్కడున్న మహిళలు వెంటనే మేకలను పట్టాలపై నుంచి పక్కకు తోలేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ మేకలు అక్కడి నుంచి కదలకుండా ఒకే చోట నిలబడిపోవడంతో, పరిస్థితిని వెంటనే అదుపు చేయలేక మహిళలు కంగారు పడ్డారు.
కనురెప్ప మూసి తెరిచేలోపే వచ్చిన రైలు, పట్టాలపై నిలబడి ఉన్న మేకలను ఢీకొడుతూ వేగంగా వెళ్ళిపోయింది. హతిగావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటనలో, రైలు కింద పడి డజన్ల కొద్దీ మేకలు దారుణంగా ప్రాణాలు కోల్పోయాయి.

Leave a Reply