అయ్యో భగవంతుడా! కన్నుమూసి తెరిచేలోపే కారులో చెలరేగిన మంటలు.. ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ సజీవదహనమైన ఘోరం. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.!

ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కె. జగదీష్ బాబు ఆదివారం ఉదయం తన కారులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఉదయం 7.15 గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలోని 365బీబీ జాతీయ రహదారిపై కారు వెళ్తుండగా, ఊహించని విధంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.

నిద్రమత్తు కారణంగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ఢీకొన్న కొద్ది నిమిషాల్లోనే భారీగా మంటలు చెలరేగడంతో, లోపల చిక్కుకున్న డాక్టర్ జగదీష్ బాబు మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మొదట్లో గుర్తుపట్టడం కష్టంగా మారింది. అనంతరం ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో న్యూరో సర్జరీ విభాగాధిపతి అని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *