అటవీ ప్రాంతంలో తప్పిపోయి, దాదాపు 50 గంటలకు పైగా పోరాడిన మూడేళ్ల చిన్నారిని నేపాల్లో ప్రాణాలతో సురక్షితంగా కాపాడారు.
తల్లిదండ్రులకు దూరమై తీవ్ర భయాందోళనలతో గడిపిన ఆ చిన్నారి, శరీరానికి కొన్ని గాయాలైనప్పటికీ క్షేమంగా బయటపడటం స్థానికులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.
తల్లి ప్రేమ, ఆశీస్సులు ఉన్న బిడ్డను ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏమీ చేయలేవన్న మాటకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గడ్డకట్టే చలి, వన్యప్రాణుల ముప్పు పొంచి ఉన్న దట్టమైన అడవిలో అంత చిన్నారి ఇన్ని గంటల పాటు ప్రాణాలతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రెస్క్యూ బృందాలు చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించాయి. ప్రస్తుతం ఆ పాపకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. పెను ప్రమాదాన్ని దాటి చిన్నారి ప్రాణాలతో బయటపడిన ఈ అద్భుత దృశ్యాలు, వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply