“అరిచావో చంపేస్తా!” మెడకు తీగ బిగించి మేడపైకి వెళ్లిన విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం… ఉద్యోగంలో చేరిన 6 రోజులకే దారుణం! సంచలనం సృష్టించిన ఉదంతం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆనంద్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటూ ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకుంటున్న ఒక విద్యార్థిని భవనం మేడపై ఉండటం చూసిన ధరమ్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డ్, ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సదరు విద్యార్థిని కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె మెడకు వైరు/తీగను గట్టిగా బిగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఆ విద్యార్థిని మొబైల్ ఫోన్‌ను లాక్కొని, మేడ తలుపులను బయటి నుంచి లాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు గట్టిగా అరిచి కేకలు వేయడంతో కింద ఉన్నవారు వచ్చి ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఉద్యోగంలో చేరిన కేవలం 6 రోజులకే ఈ ఘోరానికి ఒడిగట్టిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ యువకుడిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు నేరస్థుడిని తీసుకెళ్లగా, అతడు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఒక కానిస్టేబుల్ గాయపడగా, పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగలడంతో అతడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *