అరె ఏంటి నిజమా..? “నెయిల్ పాలిష్‌పై నిషేధమా?” ప్రముఖ దేశంలో కొత్త రూల్స్.. కానీ ఓ ట్విస్ట్..!

బ్రిటన్‌లో నెయిల్ పాలిష్‌ను పూర్తిగా నిషేధించినట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.

అయితే వాస్తవానికి నెయిల్ పాలిష్‌పై సంపూర్ణ నిషేధమేమీ విధించలేదు. కొన్ని రకాల జెల్ నెయిల్ పాలిష్‌లలో ఉపయోగించే ఒక నిర్దిష్ట రసాయనంపై మాత్రమే కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. UV (అల్ట్రావయోలెట్) లేదా LED లైట్ల సహాయంతో నెయిల్ పాలిష్ త్వరగా ఆరిపోయేలా గట్టిపడటానికి ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు.

ఈ రసాయనం నెయిల్ పాలిష్ త్వరగా సెట్ కావడానికి తోడ్పడుతుంది. అయితే అన్ని రకాల నెయిల్ పాలిష్‌లలో ఈ రసాయనం ఉండదు. ఇప్పటికే ఈ రసాయనం లేకుండా తయారైన ఎన్నో ప్రత్యామ్నాయ నెయిల్ పాలిష్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనల వల్ల నెయిల్ ఆర్ట్ లేదా నెయిల్ పాలిష్ వేసుకోవడం పూర్తిగా ఆగిపోదు. వినియోగదారులు తాము వాడే నెయిల్ పాలిష్‌లో సదరు రసాయనం ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

బ్రిటన్‌లో ఆగస్టు 15 నుంచి ఈ రసాయనం కలిగిన కొత్త సౌందర్య సాధనాలను మార్కెట్లోకి విక్రయానికి తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇప్పటికే నిల్వ ఉన్న పాత ఉత్పత్తులను వాడి ముగించడానికి బ్యూటీ పార్లర్లకు నిర్దిష్ట గడువు ఇచ్చారు. ఈ వెసులుబాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14తో ముగియనుంది. ఆ తర్వాత ఈ రసాయనం కలిగిన సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లో పూర్తిగా నిలిచిపోతాయి.

ఈ రసాయనం వల్ల సంతానోత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావాలు పడే ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. ఐరోపా దేశాలలో కూడా ఇప్పటికే ఇలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే, దీనివల్ల నెయిల్ పాలిష్ వేసుకోవడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఈ హానికారక రసాయనం లేని సురక్షితమైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. కాబట్టి సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో నెయిల్ ఆర్ట్ చేయించుకునేటప్పుడు ఉపయోగించే ఉత్పత్తుల్లో ఈ రసాయనం ఉందో లేదో ముందే అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం.


Posted

in

by

Tags: