ఆకాస (Akasa) ఎయిర్ విమానంలో ప్రయాణించి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడు, తన చెక్-ఇన్ సూట్కేస్ తీవ్రంగా ధ్వంసమైన స్థితిలో ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురై విమానాశ్రయంలోనే వాగ్వాదానికి దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విమానం దిగి తన లగేజీని తీసుకున్నప్పుడు, సూట్కేస్ చక్రం మరియు దాని పక్క భాగాలు పూర్తిగా విరిగిపోయి ధ్వంసమవ్వడం చూసి ఆ ప్రయాణికుడి కోపం కట్టలు తెంచుకుంది.
దీనిపై విమానాశ్రయంలో ఉన్న గ్రౌండ్ స్టాఫ్ (సిబ్బంది)కి ఫిర్యాదు చేయగా, ‘ఇది పగిలిపోయినట్లు లేదు’ అని వారు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని ఆ ప్రయాణికుడు ఆరోపించాడు.
తనకు ఎదురైన ఈ దుస్థితిని, సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీసిన ఆ ప్రయాణికుడు, దానిని ‘ఎక్స్’ (X) సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ప్రయాణికుల సామానును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం విమానయాన సంస్థల ప్రధాన బాధ్యత అని, సరైన సమాధానం ఇవ్వకుండా ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ఇలాంటి చర్యలపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Leave a Reply