టర్కీలోని ఇస్తాంబుల్ సముద్ర తీరంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతుండగా, ఊహించని విధంగా వధువు గాలిలో ఎగిరిన ఓ భయానక ఘటన చోటుచేసుకుంది.
అందమైన దుస్తుల్లో ముస్తాబైన వధువు చేతిలో పెద్ద పరిమాణంలో ఉన్న రంగురంగుల హీలియం బెలూన్లను పట్టుకుని పోజులిస్తుండగా, సముద్రపు గాలి అకస్మాత్తుగా అత్యంత వేగంగా వీయడం ప్రారంభించింది.
ఆ గాలి తీవ్రతకు బెలూన్లు ఒక్కసారిగా పైకి లాగబడటంతో, వాటిని పట్టుకున్న వధువు కాళ్లు నేల మీద నుంచి పైకి లేచి.. కొద్ది సెకన్ల పాటు ఆమె గాలిలో వేలాడింది.
ఇది ఏమాత్రం ఊహించని ఫోటోగ్రాఫర్, అక్కడున్న వారు ఏం చేయాలో పాలుపోక షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై భయాందోళనలతో ఆమెను పట్టుకునేందుకు కేకలు వేస్తూ పరుగులు తీశారు.
అదే సమయంలో అక్కడున్న ఒక వ్యక్తి సమయస్ఫూర్తితో వేగంగా స్పందించడంతో వధువు సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆపద తృటిలో తప్పిన ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
