“అర్ధరాత్రి 3:30 గంటలకు వచ్చిన ఒక్క ఫోన్ కాల్..!” పరుగున వెళ్లి చూసిన తల్లిదండ్రులు.. “2 ఏళ్ల ప్రేమకు ఎదురైన పెను విషాదం.. ప్రియురాలి ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్.. చెట్టుకు వేలాడుతున్న మృతదేహం.. కలకలం రేపిన ఘటన..!!

గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో, రాత్రి వేళ ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 31 ఏళ్ల బ్యాంక్ లోన్ మేనేజర్‌ను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పటాన్ జిల్లాకు చెందిన రంజిత్‌జీ ఠాకూర్ అనే యువకుడు సిద్ధ్‌పూర్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తుండగా, పక్క ఊరికి చెందిన ఒక యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

గత అక్టోబర్ 27వ తేదీన విధులకు వెళ్లిన రంజిత్‌జీ, అర్ధరాత్రి తన ప్రియురాలిని చూసేందుకు ఆమె గ్రామానికి వెళ్లగా, ఆ యువతి కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు రంజిత్‌జీ కాళ్లు, చేతులను అక్కడున్న ఓ చింతచెట్టుకు తాళ్లతో కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరాతక ఘటనకు పాల్పడిన యువతి తల్లి, సోదరుడితో సహా నలుగురిని అరెస్టు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: