“ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల తరహాలోనే మహిళలను డెలివరీ చేసేందుకు ఏర్పాటైన దారుణ నెట్‌వర్క్!”.. సైబర్ క్రైమ్ పోలీసుల సంచలన దర్యాప్తు నేపథ్యం..!!!

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు, పిజ్జాలు ఆర్డర్ చేసి ఇంటి వద్దకే తెప్పించుకున్నట్లుగానే… మహిళలను వస్తువుల్లా మార్చి, వెబ్‌సైట్ల ద్వారా ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసే ఒక భారీ సెక్స్ రాకెట్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో, అక్రమ అశ్లీల వెబ్‌సైట్ల ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన మహిళలను ఎంచుకుని ఆర్డర్ చేసుకునే వికృత వ్యాపారం సాగుతుండటం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ఈ సైబర్ ముఠా ప్రత్యేక వెబ్‌సైట్లను సృష్టించి, పిజ్జా షాపుల్లోని మెనూ కార్డు తరహాలో వందలాది మంది మహిళల ఫోటోలు, వివరాలు, శరీర వర్ణనలను క్యాటలాగ్‌ రూపంలో అప్‌లోడ్ చేశారు. కస్టమర్లు ఆ వెబ్‌సైట్లను సందర్శించి మహిళలను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించగానే వారిని కోరిన ప్రదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా పంపుతున్నారు.

పేదరికం, అమాయకత్వం, మాయమాటల వలలో చిక్కుకున్న మహిళల దుర్భర పరిస్థితులను ఆసరాగా చేసుకుని, వారిని ఇలా ఆన్‌లైన్ సరుకుగా మార్చి అమ్మే దారుణానికి పాల్పడుతున్నారు.

సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఇటువంటి అక్రమ వెబ్‌సైట్లను గుర్తించి అడ్డుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈ ఆన్‌లైన్ వ్యభిచార ముఠాలోని దళారులను, వారి వెనుక ఉన్న ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు ప్రారంభించారు.

మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఘోరమైన డిజిటల్ అకృత్యాలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, సంబంధిత పోర్న్ వెబ్‌సైట్లను వెంటనే శాశ్వతంగా నిలిపివేయాలని ప్రజలు, మహిళా సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.


Posted

in

by

Tags: