మహారాష్ట్రలోని కల్యాణ్ సమీపంలో ఉన్న బాప్ గావ్ ప్రాంతంలో అమానవీయమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. పిల్లలు లేని ఒక దంపతులు, తమ స్నేహితుడి భార్య మరణించడంతో అతని 3 ఏళ్ల ఆడపిల్లని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే, ఆ చిన్నారి పక్కింటి మహిళను ‘అమ్మ’ (మమ్మీ) అని పిలిచినందుకు ఆ పెంపుడు తల్లి దిల్షాద్ షేక్ ఆగ్రహంతో ఊగిపోయింది. పసిపాప అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై మృగంలా దాడి చేసింది.
ఆ మహిళ కోపం అంతటితో ఆగకుండా, ఆ చిన్నారి కళ్లలో మరియు నోటిలో కారం పొడి పోసి చిత్రహింసలకు గురిచేసింది. ఆ పసిపాప నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తున్నా, ఏమాత్రం కనికరం లేకుండా ఆ మహిళ దాడి చేస్తూనే ఉంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చూసేవారి మనసు కలచివేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భివాండి పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
