“ఆమెను ఉంచుకుందామా?” వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ “దారుణంగా పనిచేస్తోంది” అంటూ ట్రంప్ జోకులు

వాషింగ్టన్ డిసి [యుఎస్], ఏప్రిల్ 1 (ANI): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) తన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను కొనసాగించాలా లేక తొలగించాలా అని ఆలోచిస్తున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు.

ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ నవ్వుతూ, ఆమెను కొనసాగిస్తానని చెప్పారు. “మనం మీడియాను సరిదిద్దాలి. ప్రజలు మీడియాను నమ్మడం లేదు. నాకు 93% నెగటివ్ పబ్లిసిటీ వస్తోంది. కొంతమంది 97% అంటారు. 97% నెగటివ్ వార్తలు వస్తున్నాయంటే బహుశా కరోలిన్ సరిగా పనిచేయడం లేదేమో నాకు తెలియదు. ఆమె నా ప్రతినిధి… నువ్వు చాలా దారుణంగా పనిచేస్తున్నావు. ఆమెను ఉంచుకుందామా? నేను అనుకోవడం ఆమెను ఉంచుకుందాం,” అని ఆయన అన్నారు.

తనపై వచ్చే వార్తల్లో ఎక్కువ భాగం ప్రతికూలమైనవేనని ట్రంప్ పేర్కొన్నారు. “నాకు 93 నుండి 97% వరకు చెడ్డ ప్రెస్, ఫేక్ ప్రెస్ వస్తోంది. అంతా ఫేక్. అయినా నేను భారీ మెజారిటీతో గెలిచాను. ఇంత నెగటివ్ ప్రెస్ ఉన్నా గెలిచామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రజలు ప్రెస్‌ను నమ్మడం లేదు. ఇది మన దేశానికి చాలా చెడ్డ విషయం,” అని ఆయన అన్నారు.

అయితే, ట్రంప్ గతంలో లీవిట్‌ను పలుమార్లు ప్రశంసించారు. ఉమెన్స్ హిస్టరీ మంత్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలు మరియు బహుశా అత్యుత్తమ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె. కరోలిన్ అద్భుతంగా పనిచేస్తోంది. ఆమె నన్ను సరిదిద్దుతుంది. ‘సార్, మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు’ అని చెబుతుంది. నేను ఏమీ చేయలేను. ఒకవేళ ఆమె లేకపోతే జీవితం ఇంకా ఎగ్జైటింగ్‌గా ఉండేది కదా? థాంక్యూ కరోలిన్,” అని కొనియాడారు.

విలేకరులతో కరోలిన్ లీవిట్‌కు ఉన్న సంబంధం చాలా కఠినంగా ఉంటుంది. అక్టోబర్ 20న ఒక రిలేకరిని ఆమె “లెఫ్ట్ వింగ్ హ్యాక్” అని, అతను జర్నలిస్ట్ కాదని మండిపడ్డారు. ఆగస్టు 11, 2025న ఒక బ్రిఫింగ్ సమయంలో, విలేకరుల కోసం పెద్ద బ్యూటిఫుల్ రూమ్ కడతారా అని అడిగితే, ట్రంప్ స్పందిస్తూ, “మీకు సౌకర్యంగా ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి లేదు” అని తేల్చి చెప్పారు.


Posted

in

by

Tags: