ఆయుర్వేద వైద్యుడు నిశాంత్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తరచుగా ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారాలను సూచిస్తుంటారు. దంతాల సమస్యల కోసం ఖరీదైన డెంటల్ క్లినిక్‌లకు వెళ్లే బదులు, ఇంట్లోనే ఉండే ఒక తెల్లని పౌడర్‌తో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన ఒక వీడియోలో తెలిపారు.
ఆ తెల్లని పౌడర్ ఏమిటి? దంతాల సమస్యలన్నింటినీ పరిష్కరించే ఆ తెల్లని పౌడర్ మరేదో కాదు, మనందరికీ తెలిసిన పటిక (Fitkari/Alum). పటిక దంతాల మెరుపును తిరిగి తీసుకురావడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి మరియు చిగుళ్లను దృఢపరచడానికి సహాయపడుతుంది.
తయారీ విధానం:
- ముందుగా పటికను మెత్తని పొడిగా (పౌడర్) చేసుకోవాలి.
- ఈ పౌడర్‌ను పెనంపై వేసి వేడి చేయాలి.
- దీనికి కొంచెం పసుపు, వంట సోడా (Baking Soda) కలపాలి.
- చివరగా ఆవనూనె (Mustard oil) వేసి పేస్ట్‌లా తయారు చేయాలి.
- సాధారణ టూత్ పేస్ట్లాగే దీనిని దంతాలపై అప్లై చేసి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల పాటు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
