నటుడు అజిత్ కుమారుడు ఆరా ఫార్మింగ్ తరహాలో డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మలేషియాలో కార్ రేసింగ్‌లో పాల్గొంటున్న తన తండ్రి అజిత్‌ను ఉత్సాహపరిచేందుకు ఆద్విక్ చేసిన ఈ పని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మలేషియాలోని సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నటుడు, రేసర్ అయిన అజిత్ కుమార్ గత కొన్ని వారాలుగా కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఈ విజువల్స్ ఒక సిరీస్‌లా వస్తాయా లేదా డాక్యుమెంటరీలా వస్తాయా అనేది తర్వాత నిర్ణయిస్తామని దర్శకుడు ఏ.ఎల్. విజయ్ గతంలో తెలిపారు. ఇటీవలే తన భార్య షాలినికి ముద్దు పెట్టి రేసింగ్‌కు వెళ్తున్న అజిత్ వీడియో కూడా వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే, ఆయన కుమారుడు ఆద్విక్.. ఆరా ఫార్మింగ్ స్టైల్‌లో పడవను నడుపుతున్నట్లుగా డ్యాన్స్ చేశారు.
ఎవరు ఈ ఆరా ఫార్మింగ్ (Ara Farming)?
రయ్యన్ అర్కన్ దికా అనే 11 ఏళ్ల ఇండోనేషియా బాలుడు ఈ ఏడాది ఇంటర్నెట్‌లో అత్యంత వైరల్ అయిన వ్యక్తుల్లో ఒకరు. ఒక పడవ పోటీ సమయంలో, అతను ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం భయం లేకుండా పడవ నడుపుతూ డ్యాన్స్ చేసిన విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. సినిమా సెలబ్రిటీల నుండి క్రీడాకారుల వరకు చాలా మంది అతని డ్యాన్స్ స్టెప్పులను రీక్రియేట్ చేస్తున్నారు.
