ఆహారం తినేటప్పుడు లేదా నీళ్లు తాగేటప్పుడు పొరపాటన ఆహారపు ముక్కలు శ్వాసనాళంలోకి వెళ్లడాన్ని మనం ‘పొరబోవడం’ అంటాం. సాధారణంగా దగ్గినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించి ప్రాణాంతకమవుతుంది.
పొరబోయినప్పుడు వెంటనే చేయాల్సినవి:
- కంగారు పడకండి: పొరబోయినప్పుడు మొదట భయాందోళనకు గురికావద్దు. కంగారు పడితే శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది.
- బలంగా దగ్గండి: శ్వాసనాళంలో అడ్డుపడిన వస్తువును బయటకు పంపడానికి దగ్గు అనేది శరీరం చేసే సహజ ప్రయత్నం. కాబట్టి, అడ్డంకి తొలగిపోయే వరకు బలంగా దగ్గండి.
- వెంటనే నీళ్లు తాగొద్దు: పొరబోయిన వెంటనే నీళ్లు తాగడం సరికాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు నీళ్లు తాగితే ఆ ఆహారపు ముక్కలు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. దగ్గు తగ్గి, అడ్డంకి తొలగిన తర్వాతే నీళ్లు తాగాలి.
- హైమ్లిక్ యుక్తి (Heimlich Maneuver): ఒక వ్యక్తికి తీవ్రమైన శ్వాస తడబడటం, మాట్లాడలేకపోవడం వంటివి జరిగితే.. ఆ వ్యక్తి వెనుక నుండి నిలబడి, వారి పొత్తికడుపు పైభాగాన్ని గట్టిగా వెనక్కి మరియు పైకి నొక్కాలి. ఇది శ్వాసనాళంలో చిక్కుకున్న ఆహారాన్ని బయటకు నెట్టడానికి సహాయపడుతుంది.
చేయకూడని తప్పులు: ఆహారం తినేటప్పుడు మాట్లాడటం లేదా నవ్వడం చేయవద్దు. అలా చేసినప్పుడు గొంతులోని ‘ఎపిగ్లోటిస్’ (Epiglottis) అనే వాల్వ్ సరిగ్గా మూసుకోదు, ఫలితంగా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్తుంది.
