అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ సారికా యాదవ్.. అమెరికన్ల భోజనం, నిద్ర సమయాలకు సంబంధించిన అలవాట్లపై షేర్ చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భారతీయులు సాధారణంగా రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య భోజనం చేసి, అర్ధరాత్రి వేళ నిద్రపోతారని సారిక తన అమెరికన్ స్నేహితులకు చెప్పినప్పుడు, వారు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎందుకంటే, అమెరికన్లు సాయంత్రం 6:00 నుంచి 6:30 గంటల లోపే రాత్రి భోజనం ముగించేసి, రాత్రి 8:00 గంటలకే నిద్రపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు వేకువజామున 4:00 గంటలకే నిద్రలేచి తమ దైనందిన పనులను ప్రారంభిస్తారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, “ఇది పాశ్చాత్య సంస్కృతి కాదు, మన ప్రాచీన భారతీయ సనాతన సంప్రదాయం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ సూర్యాస్తమయం కాగానే భోజనం చేసి, తెల్లవారుజామునే నిద్రలేచే ఆచారం ఇంకా వాడుకలోనే ఉంది.
సాయంత్రం 7 గంటల కంటే ముందే భోజనం చేయడం, తెల్లవారుజామున త్వరగా నిద్రలేవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని, ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఆయుర్వేదం, అలాగే ఆధునిక వైద్య శాస్త్రం కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం.

Leave a Reply