భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటకు బయలుదేరే ముందు తన అధికారిక నివాసంలో నెమళ్లు, గోవులకు స్వయంగా ఆహారం తినిపించి తన జంతుప్రేమను చాటుకున్నారు.
దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ప్రధాని నెమళ్లకు ప్రేమగా ధాన్యపు గింజలను వేయడం, గోమాతలను ఆప్యాయంగా నిమురుతూ స్వహస్తాలతో మేత తినిపించడం కనిపించింది.
ప్రకృతి ఒడిలో, మూగజీవాల మధ్య ప్రధాని మోదీ ప్రశాంతంగా గడిపిన ఉదయపు క్షణాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలాంటి బెరుకు లేకుండా నెమళ్లు ఆయన చుట్టూ తిరుగుతూ దాణా తినడం, గోవులకు ఆయన ఆహారం తినిపించిన తీరు అందరి హృదయాలను హత్తుకుంటోంది.
ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందు పంచుకున్న ఈ నిరాడంబరమైన, ఆత్మీయ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటున్నాయి.
