ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ఇంటి నేల కింద ప్లాస్టిక్ డ్రమ్ములు పాతిపెట్టి, అందులో కోట్ల కొద్దీ నగదును దాచిపెట్టిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
అనుమానంతో బుధవారం రాత్రి ఆ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటి నేలను తవ్వి సోదాలు చేపట్టారు.
ఆ సమయంలో నేల కింద నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా బయటకు తీసిన డ్రమ్ములను తెరిచి చూడగా.. అందులో కట్టల కొద్దీ నోట్లు నిండి ఉండటం చూసి పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మహారాష్ట్రలో పనిచేస్తున్న సమయంలో నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కాలంలో దొంగిలించిన డబ్బు ఇదని తెలుస్తోంది. అయితే, ఇరుగుపొరుగు వారితో జరిగిన ఓ గొడవ కారణంగా ఈ భారీ గుట్టు పోలీసులకు తెలిసిందని సమాచారం.
ఇప్పటివరకు సుమారు రూ. 4 కోట్ల నగదును లెక్కించడం పూర్తి కాగా, మొత్తం నగదు రూ. 60 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
