ఇంటి యజమానితో అక్రమ సంబంధం.! “తాళి కట్టిన భార్యను ఆ స్థితిలో నేరుగా చూసిన భర్త”. యాసిడ్ తాపించి ప్రాణం పోయేలా హత్య.? అక్రమ సంబంధంతో విరిగిపోయిన జీవితం.!

ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని జోగి నవాడ ప్రాంతంలో, ఇస్రాయిల్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

మృతి చెందిన వ్యక్తి తల్లి, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఆయన భార్య గౌసియా మరియు అదే ఇంటి యజమాని సలీమ్‌లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

అంటే, మృతుడి భార్యకు, ఇంటి యజమాని సలీమ్‌కు మధ్య అక్రమ సంబంధం ఉండేది. వీరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇస్రాయిల్ నేరుగా చూడటంతో పథకం ప్రకారం హత్య చేశారు.

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్తను, భార్య మరియు ఆమె ప్రియుడు కలసి పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఆరోపించారు. భార్య ప్రవర్తన వల్ల, వరుస గొడవల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఇస్రాయిల్, పలుమార్లు తన బాధను కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో, అతడితో బలవంతంగా యాసిడ్ తాపించి హత్య చేశారని పేర్కొంటూ ఆయన బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడానికి ముందు, ఇస్రాయిల్ పోలీసులకు తన భార్య, సలీమ్‌ల కుట్ర గురించి వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు బలంగా తెలిపారు.

ఈ వ్యవహారం గురించి మాట్లాడిన నగర పోలీస్ సూపరింటెండెంట్ మానుష్ పారిక్, మృతదేహాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆయన యాసిడ్ తాగాడా లేదా ఇతర కారణాల వల్ల మరణించాడా అనే నిజం పూర్తిగా బయటపడుతుందని పోలీస్ యంత్రాంగం పేర్కొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, సాక్ష్యాలు, ఆధారాల ప్రాతిపదికన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *