ముంబైలో ‘బ్లింకిట్’ (Blinkit) సంస్థకు చెందిన ఒక డెలివరీ బాయ్.. పట్టపగలే నడిరోడ్డుపై ఉన్న ఒక పొడవైన పామును ఎంతో నేర్పుగా పట్టుకుని, తన డెలివరీ బ్యాగులో వేసుకున్న వీడియో ఒకటి ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో విడుదలై విపరీతంగా వైరల్ అవుతోంది.
‘@gharkekalesh’ అనే అకౌంట్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో, పసుపు రంగు బ్లింకిట్ టీ-షర్ట్ ధరించిన ఆ యువకుడు ఎలాంటి భయం లేకుండా పాము తోకను పట్టుకుని పైకి లేపి, నేరుగా తన డెలివరీ బ్యాగులో పెట్టడం రికార్డయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 1.5 లక్షలకు పైగా వీక్షణలను (Views) సొంతం చేసుకుంది. ఈ వింత వీడియోను చూసిన నెటిజన్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో రకరకాల హాస్యభరితమైన కామెంట్లు పెడుతున్నారు.
వారిలో ఒక యూజర్.. “ముంబై మనల్ని ఎప్పుడూ నిరాశపరచదు, బ్లింకిట్ సంస్థ ఇప్పుడు అధికారికంగా ‘పాముల డెలివరీ’ కూడా ప్రారంభించినట్లుంది.. నేను కూడా ఒక కొండచిలువను (పైథాన్) ఆర్డర్ చేయాలా అని ఆలోచిస్తున్నాను” అని రాసుకొచ్చాడు.
మరొక యూజర్ స్పందిస్తూ.. “కంపెనీ నష్టాల్లో నడుస్తున్నట్లుంది, అందుకే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వీరు పార్ట్-టైమ్‌గా ఇలాంటి అదనపు పనులు చేస్తున్నారు” అంటూ వ్యంగ్యంగా (కిండల్‌గా) కామెంట్ చేశారు.
