ఇకపై 10 నిమిషాల డెలివరీ ఉండదు.. స్విగ్గీ, జోమాటో, బ్లింకిట్‌లకు కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశం

ఆన్‌లైన్ ద్వారా వస్తువులను డెలివరీ చేసే స్విగ్గీ (Swiggy), జోమాటో (Zomato), బ్లింకిట్ (Blinkit) వంటి సంస్థలు ’10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

పోటీలో భాగంగా ప్రాణాల మీదకు: ప్రస్తుత కాలంలో ఆహారం నుండి నిత్యావసరాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ రంగంలో ఉన్న స్విగ్గీ, జోమాటో, జెప్టో, అమెజాన్ వంటి సంస్థల మధ్య పోటీ పెరగడంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు ’10 నిమిషాల డెలివరీ’ హామీని ఇస్తున్నాయి. అయితే, ఈ తక్కువ సమయంలో డెలివరీ చేయడం కోసం డెలివరీ బాయ్స్ రోడ్లపై అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఉద్యోగుల సమ్మె – కేంద్రం స్పందన: గత క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సమయంలో, డెలివరీ భాగస్వాములు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని ’10 నిమిషాల డెలివరీ’ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ, వివిధ డెలివరీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ప్రకటనల తొలగింపుకు ఆదేశం: “ఆన్‌లైన్‌లో 10 నిమిషాల డెలివరీ అనే ప్రకటనలను వెంటనే తొలగించాలి. కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధన ఉద్యోగుల ప్రాణాలను రిస్క్‌లో పడేస్తోంది. కాబట్టి ఈ పద్ధతిని మానుకోవాలి” అని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో డెలివరీ భాగస్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: