కాగ్నిజెంట్ (Cognizant) ఐటీ సంస్థ తమ ఉద్యోగులు పని చేస్తున్నారా, లేదా అని నిశితంగా పర్యవేక్షించడం (Monitoring) ప్రారంభించింది.
కాగ్నిజెంట్ కఠిన నియమాలు
ఉద్యోగుల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, కాగ్నిజెంట్ PROHANCE వంటి ఉద్యోగుల నిర్వహణ సాధనాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ పర్యవేక్షణలో భాగంగా సంస్థ ఈ క్రింది నియమాలు విధించింది:
5 నిమిషాల నిబంధన: ఉద్యోగి ఆఫీస్ కంప్యూటర్లలో మౌస్ లేదా కీబోర్డ్‌ను ఐదు నిమిషాలకు మించి ఉపయోగించకపోతే, ఆ ఉద్యోగి పని చేయకుండా, ‘నిష్క్రియంగా’ (Inactive) ఉన్నట్లుగా పరిగణించబడుతుంది.
15 నిమిషాల నిబంధన: 15 నిమిషాలకు మించి పని చేయకుండా ఉంటే, ఉద్యోగి ఇతర పనుల్లో ‘నిమగ్నమై ఉన్నట్లుగా’ (Busy) భావించబడుతుంది.
ఈ పర్యవేక్షణ విధానం ప్రతి బృందానికి (Team) భిన్నంగా ఉంటుంది.
సంస్థ వివరణ
ఈ ప్రక్రియ ఉద్యోగులలో విమర్శలకు దారి తీయడంతో, సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ పర్యవేక్షణ ద్వారా సేకరించిన డేటాను ఉద్యోగుల:
పనితీరును అంచనా వేయడానికి
పదోన్నతులు (Promotions)
బోనస్‌లు వంటి విషయాల కోసం ఉపయోగించబడదని సంస్థ స్పష్టం చేసింది.
