“మేమే వెనిజులాను పాలించబోతున్నాం.. అక్కడ ఉన్న చమురు నిల్వలను పూర్తిగా వినియోగించుకునే వరకు, వాణిజ్యం క్రమబద్ధీకరించబడే వరకు చాలా కాలం పాటు వెనిజులా మా నియంత్రణలోనే ఉంటుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీని ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సామ్రాజ్యంపై అమెరికా పట్టు సాధించింది.
సౌదీ కంటే ఎక్కువేనా?
ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు మరియు బంగారం ఉన్న దేశం ఏది అంటే చాలామంది సౌదీ అరేబియా లేదా అరబ్ దేశాలు అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా.
- నిరూపితమైన నిల్వలు: వెనిజులాలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా.
- ముఖ్య కేంద్రం: తూర్పు వెనిజులాలోని ఒరినోకో (Orinoco) చమురు క్షేత్రం ఈ నిల్వలకు ప్రధాన వనరు.
చైనా, రష్యాలకు చెక్:
వెనిజులా నుండి చమురును చైనా భారీగా కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు వెనిజులా అమెరికా వశం కావడంతో, చైనా మరియు రష్యాలు అమెరికా వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- డాలర్ విలువ: అమెరికా చమురు శక్తి పెరగడంతో డాలర్ విలువ మరింత పెరుగుతుంది.
- అప్పుల విముక్తి: చమురు వాణిజ్యం ద్వారా అమెరికా తనకున్న అప్పులను సగానికి పైగా తగ్గించుకునే అవకాశం ఉంది.
- అట్టకత్తులు: యుద్ధ తంత్రంలో చైనా, రష్యాలను నిస్తేజం చేస్తూ (అట్టకత్తులుగా మారుస్తూ) అమెరికా ఈ వ్యూహాత్మక అడుగు వేసింది.
వెనిజులా చమురులోని సవాళ్లు:
వెనిజులాలో నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడి ముడి చమురు చాలా చిక్కగా (Heavy & Viscous) మరియు సల్ఫర్ ఎక్కువగా కలిగి ఉంటుంది.
- శుద్ధి ప్రక్రియ: దీనిని వెలికితీయడం, శుద్ధి చేయడం చాలా ఖరీదైన పని. దీనికోసం ప్రత్యేకమైన స్టీమ్ ఇంజెక్షన్ వంటి సాంకేతికతలు అవసరం.
- తగ్గిన ఉత్పత్తి: గతంలో రోజుకు కొన్ని మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసిన వెనిజులా, ప్రస్తుతం నిర్వహణ లోపం మరియు అంతర్జాతీయ ఆంక్షల వల్ల కేవలం 1.0-1.2 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది.
అమెరికా హస్తగతం చేసుకున్నది ఇదే!
గత ఏడాది పొడవునా అమెరికా విధించిన ఆంక్షల వల్ల వెనిజులా తన చమురును విదేశాలకు ఎగుమతి చేయలేకపోయింది. ఫలితంగా అక్కడి నిల్వ గిడ్డంగలన్నీ నిండిపోయాయి. 2025 చివరి నాటికి కొత్తగా చమురు దాచడానికి కూడా చోటు లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే అమెరికా దాడులు చేసి, ఇప్పటికే నిల్వ ఉన్న పెట్రోల్, వెలికితీయని ముడి చమురు మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ప్రపంచ పెట్రో కెమికల్ రంగానికి రాజుగా అమెరికా అవతరించింది.
