ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
ఇప్పటివరకు మనం ఏఐని రచనలు, ఫొటోలు, వీడియోలు, సమాచారం కోసం ఉపయోగించడం చూశాం. కానీ.. ఓ బెంగళూరు స్టార్టప్ కంపెనీ CEO మాత్రం ఏకంగా చట్టపరమైన ఫిర్యాదు తయారు చేసుకోవడానికి ఏఐ సహాయం తీసుకున్నారు.
బెంగళూరుకు చెందిన భారత్‌అగ్రి సంస్థ CEO సిద్ధార్థ్ డియలానీ, తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తితో రోడ్డు మీద గొడవ జరిగింది.
సోమ్, ఎడ్జిబురా సిగ్నల్స్ మధ్య వెళ్తుండగా.. ఓ బైక్ రైడర్ తన బైక్ కారుకు తగిలిందంటూ గొడవకు దిగినట్లు సిద్ధార్థ్ తెలిపారు.
అంతటితో ఆగకుండా.. ఆ వ్యక్తి కారుపైకి ఎక్కి తొక్కడం, కారును అడ్డగించి బెదిరించడం చేసినట్లు ఆయన ఆరోపించారు.
అయితే.. ఈ ఘటన మొత్తం కారులో ఉన్న డ్యాష్క్యామ్లో రికార్డ్ అయింది.
ఇదే సమయంలో సిద్ధార్థ్ ఓ ఆసక్తికరమైన పని చేశారు.
నేరుగా లాయర్‌ను సంప్రదించకుండా.. గూగుల్ జెమినీ ఏఐ సహాయంతో చట్టపరమైన ఫిర్యాదును సిద్ధం చేశారు.
ఆ ఫిర్యాదును బెంగళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్లో సమర్పించారు.
డ్యాష్‌క్యామ్ వీడియోను కూడా ఆధారంగా అందించారు.
పోలీసులు ఆ ఆధారాలను పరిశీలించి.. బైక్ రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు సిద్ధార్థ్ తెలిపారు.
చివరికి ఆ వ్యక్తి లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు.. కారుకు జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన సిద్ధార్థ్.. బెంగళూరు పోలీసులు ఎలాంటి లంచం లేకుండా ఈ వ్యవహారాన్ని ప్రొఫెషనల్‌గా పరిష్కరించారని ప్రశంసించారు.
అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆయన సరదాగా స్పందిస్తూ..
“ఇప్పుడు ఏఐ నా లాయర్‌గా కూడా మారిపోయింది!” అని పేర్కొన్నారు.
అయితే.. ఏఐ చట్టపరమైన సమాచారాన్ని అందించగలిగినా, నిజమైన న్యాయ సలహా అవసరమైన సందర్భాల్లో అర్హత కలిగిన న్యాయవాదిని సంప్రదించడం ముఖ్యం.

Leave a Reply