ఇక 10 సెకన్లే లిమిట్.. కొత్త యూపీఐ రూల్ అమలు; గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలకు చెక్!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో “10 సెకన్ల రూల్” అమలులోకి వచ్చింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా జరిగే నగదు లావాదేవీల్లో ఇది 3 ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది.

1. వేగవంతమైన లావాదేవీలు: యూపీఐ లావాదేవీల ఏపీఐ రెస్పాన్స్ (API Response) సమయాన్ని గతంలో ఉన్న 30 సెకన్ల నుండి 10 సెకన్లకు తగ్గించారు. దీనివల్ల ముఖ్యంగా రద్దీ సమయాల్లో (Peak hours) పేమెంట్స్ విఫలం కాకుండా చాలా వేగంగా మరియు నమ్మకస్థంగా జరుగుతాయి.

యూపీఐలో API అంటే ఏమిటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) అనేది రెండు యాప్‌లు లేదా వ్యవస్థలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి అనుమతించే డిజిటల్ వంతెన వంటిది. మీరు నగదు పంపేటప్పుడు మీ యాప్ మీ బ్యాంక్ నుండి అనుమతి తీసుకోవడానికి, అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి ఈ ఏపీఐలు ఉపయోగపడతాయి.

2. కట్టుదిట్టమైన భద్రత: ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ చేసేటప్పుడు మోసాలు జరగకుండా అదనపు ధృవీకరణ ప్రక్రియలను ప్రవేశపెట్టారు. డబ్బు పంపే ముందు స్పష్టమైన నిర్ధారణ సందేశాలు (Confirmation prompts) కనిపిస్తాయి. అలాగే, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ఆటోమేటిక్ నగదు కట్‌ అయ్యే విధానాన్ని సులభంగా రద్దు చేసుకునే సౌకర్యం కల్పించారు. చాలా కాలంగా వాడని యూపీఐ ఐడీలను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేస్తారు.

3. విఫలమైన లావాదేవీల పరిష్కారం: కొత్త నిబంధనల ప్రకారం, సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ నిలిచిపోతే బ్యాంకులు మరియు యూపీఐ యాప్‌లు కొన్ని గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరించాలి. లావాదేవీ ఎందుకు విఫలమైందో వినియోగదారులకు స్పష్టమైన అప్‌డేట్స్ అందించాలి.


Posted

in

by

Tags: