అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ‘పాపాయ్స్’ (Popeyes) ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, వంటగదిలో ఉంచిన పచ్చి చికెన్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు.
కస్టమర్లకు వండి పెట్టడం కోసం నిల్వ ఉంచిన పచ్చి మాంసం పెట్టెలను తెరిచి, వంటకు ఉపయోగించే ఆ చికెన్‌పై కూర్చుని అతడు చేసిన ఈ జుగుప్సాకరమైన పనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపించింది. ఇది చూసిన కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ఆహారంలో కూడా ఇలాంటి అపరిశుభ్రమైన పనులు జరిగి ఉంటాయేమోనని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యారు.
ఈ వివాదాస్పద వీడియోను చూసిన కొందరు కస్టమర్లు.. రెస్టారెంట్‌లో తాము తిన్న ఆహారం ఇదేనా అంటూ వెంటనే సదరు రెస్టారెంట్‌ను సంప్రదించి వివరణ కోరారు. అంతేకాకుండా, దీనిపై సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తగిన విచారణ జరిపి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ఈ ఘటనకు పాల్పడిన ఉద్యోగిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.
ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల వంటగదుల్లో అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే ప్రజలు ఆహారాన్ని కొనుగోలు చేస్తున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలను, అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దాటి ఇంటర్నెట్‌లో పెను దుమారం రేపుతుండగా, ఆ రెస్టారెంట్ ఉన్న కచ్చితమైన ప్రాంతం, సంస్థ తీసుకున్న అధికారిక చర్యలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

Leave a Reply