సోషల్ మీడియాలో ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువుల విచిత్ర ప్రవర్తన, వాటి అపారమైన బలాన్ని చూపించే దృశ్యాలు చూస్తే ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుంది.
అలాంటి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్పెయిన్లోని టెండిల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
రోడ్డుపై వెళ్తున్న ఓ భారీ ఎద్దు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న నల్లరంగు కారుపై ఒక్కసారిగా దాడి చేసింది. కారు వెనుక భాగం వద్దకు వెళ్లిన ఆ ఎద్దు.. తన కొమ్ములతో, శరీర బలంతో కారును పదేపదే బలంగా ఢీకొట్టింది.
భారీ ఇనుప కారు సైతం ఆ ఎద్దు ధాటికి చిన్న బొమ్మలా వెనక్కి కదలడం వీడియోలో కనిపిస్తోంది. ఎద్దు వరుసగా దాడి చేయడంతో కారు అటూ ఇటూ కదులుతూ కనిపించింది. ఈ దృశ్యాలు చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.
ఇదంతా జరుగుతున్న సమయంలో కారు పక్కనే ఓ వ్యక్తి నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అతను కారు యజమాని అయి ఉండవచ్చని భావిస్తున్నారు. తన కళ్లముందే కారు భారీ ఎద్దు దాడికి గురవుతుండటంతో ఏం చేయాలో తెలియక అతను ఆందోళనకు గురైనట్లు కనిపిస్తోంది.
ఆవేశంతో ఉన్న ఎద్దు ఎప్పుడు తనపై దాడి చేస్తుందోననే ప్రమాదం ఉండటంతో.. ఆ వ్యక్తి అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా కార్లు బలమైన వాహనాలని భావిస్తాం. కానీ, ఇలాంటి భారీ జంతువుల దాడి ముందు అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
సినిమా యాక్షన్ సన్నివేశాలను తలపిస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ జంతువులు సమీపంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వాటికి దగ్గరగా వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Leave a Reply